అనంతానంద మాధుర్యాన
నను ఓలలాడించు
లీలా వినోదా! ప్రభూ!!
ఈ పెళుసు ఎండు కట్టెకు
నిరంతర జీవన శ్వాసనిచ్చి
చిగురింప చేస్తున్నావే!
కొండలు కోనలు తిప్పి
ఈ వేణువుతో అమోఘ
నిత్య నవ మోహన రాగాలు
నిరతమూ పలికిస్తున్నావే
నీ దైవీ స్పర్శతో
నా అల్ప హృదయానికి
అపరిమిత, అవ్యక్త
ఆనందాన్నిస్తున్నావే!
నీ అపార దయావర్షాన్ని
ఈ చిట్టి చేతులతో
ఒడిసి పట్టుకుంటున్నా
అయినా అసంపూర్ణం.
== ఇవి కూడా చూడండి ==
Inspired by following poem from Tagore’s Gitanjali:
Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.
This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.
At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.
Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.
geetaaMjali-1-leelaa-vinOdaa (Read this in English Script, but Telugu Language)
Related posts:
- గీతాంజలి 4 – కారణ ప్రేరణ ప్రభూ!
- గీతాంజలి 3 – గానామృతం
- గీతాంజలి 20 – నిశబ్దం
- గీతాంజలి 2 — అరే, ఒరే అంటున్నానే! హరీ!!
- ప్రేమ జ్ఞాపిక – గీతాంజలి 52
Related posts brought to you by Yet Another Related Posts Plugin.


గీతాంజలి ఒక తీయని సలపరం.
వాటిని అనువదించటం అంటే మన కృతజ్ఞతను ప్రకటించుకోవటం.
మనవ్విధేయతను పదిమందితో పంచుకోవటం.
మీ అనువాదాలు రెండూ బాగున్నాయి.
మరిన్ని ఎదురుచూస్తాను.
బొల్లోజు బాబా
చిలమకూరు విజయమోహన్,
Thank you very much for your kind words.
I know it is a frail attempt, but once it is about him that will be like touching iron with ParusuvEdi — indeed.
ఇదేందిరా నాయనోయ్! తెలుగు బ్లాగుల్లో అందరూ ఇలా కవితల మీద కవితల సరాగాలు వదలుతూ ఉంటే,పదాల సరిగమలను అందంగా, ఆహ్లాదంగా,ఆనందంగా పలికించలేని మాబోటివారి పరిస్థితేంటో ?
’’లీలావినోది”పై ఎన్ని కవితలు రాసినా చదివినా, ఎన్ని బొమ్మలు గీసినా చూసినా తనివి తీరదేమో !
ఆయనపై కురిపిస్తున్న మీ కవితాభిషేకాన్ని ఒడిసిపట్టడానికి చాపుతున్నా నా చిన్ని చేతులను.