ఈ బంధాలు మహా మొండివి. వాటిని తెంపాలని చూస్తే నా గుండె ముక్కలవుతుంది. స్వేచ్చ మాత్రమే నాక్కావలసింది, కానీ దాన్ని ఆశించటానికే నేను సిగ్గు పడుతున్నాను. నాకు తెలుసు – వెలలేని సంపద నీలో ఉందని, నువ్వే నా ఉత్తమ మిత్రుడవని, అయినా నా గది నిండా ఉన్న ఈ మెరుగులు తొలగించ మనసు రావటం లేదు. నన్ను చుట్టుకున్న ఈ తాడు యమపాశమనీ తెలుసు, అయినా దాన్ని యిష్టపడి కౌగిలించుకుంటున్నాను. …
Images copied from sakshi paper. avk-prasad-message-to-telugu-people (Read this in English Script, but Telugu Language)
కాంతి. ఎక్కడ ఉంది ఆ కాంతి? మండుతున్న కోరికల అగ్గితో దాన్ని ప్రజ్వరిల్లజేయి. అక్కడ దీపం ఉంది, కాని మిణుకుమను జ్వాల మాత్రం ఎప్పుడూ లేదు. నా హృదయమా! అదీ నీ దయనీయ స్థితి, ఇంత కన్నా మరణమే వెయ్యి రెట్లు నయం. విషాదం నీ తలుపు తట్టి అంటుందీ – ప్రభూవు మేల్కోనే ఉన్నాడు. ఈ రాత్రి ప్రేమ సంకేత స్థలానికి పిలుస్తున్నాడు – అని. ఆకాశం నిండా మబ్బులే, వానెప్పటీకీ ఆగేలా లేదు. నాకు …
అతనే స్వయంగా వచ్చి నా పక్కన ఆసీనుడైనాడు. కానీ నేను మేల్కొనలేదు, అది ఎంత దారుణ నిద్ర. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇంకా రాత్రి కొంత మిగిలి ఉన్నప్పుడే అతను వచ్చాడు. అతని చేతిలో మోహన మురళి అలాగే ఉంది. దాని సుస్వరాలతో నా కలలు ప్రతిధ్వనించాయి. అయ్యో నా రాత్రులన్నీ ఎందుకు వృధా అయ్యాయి. అతని శ్వాస నా నిద్రకు తగులుతున్నా కాని వాని- దర్శనం ఎప్పుడూ పోగొట్టుకుంటానెందుకు. గీతాంజలి 26 He …
అలసి సొలసిన ఈ రేయి నన్ను నీ ఒడిలో నిద్రపోనీ, ఇహ ఏ ఆలోచనలూ లేకుండా. మర్నాటి నీ పూజకు సిద్దమవ్వనీకుండా ఆత్మారాముడిని ఇహ బలవంతపెట్టనీకు. మర్నాటి ఉదయం తాజాగా పునర్జీవితున్ని చేసి మేల్కొల్పటానికి అలసిన పగటి కళ్లపైకి రాత్రి పరదాలు లాగేది నువ్వే కదా, ప్రభూ. గీతాంజలి 25 In the night of weariness let me give myself up to sleep without struggle, resting my trust upon thee. Let me not …
ప్రభూ, సంధ్యలో కలువరేకులు సున్నితంగా మూసినా, భూమినంతా నిద్రా దేవి ఒడిలో చేర్చినా, పగలు అంతా ముగిసిపోతే, పక్షులు ఇహ పాడకపోతే, గాలి అలసిన సంకేతమిస్తే అప్పుడు చీకటి పరదాలు నాపై లాగు. దుస్తులు చినిగి దుమ్ముపట్టి, నిజ శక్తినంతా కోల్పోయి, నీరాహారాలు నిండుకున్న బాటసారినుండి బిడియం పేదరికం తొలగించు, నీ చల్లని నీడలోని వికసిత పుష్పంలా అతన్ని పునర్జీవితున్ని చేయవయ్యా. గీతాంజలి 24 If the day is done, if birds sing no more, if …
ఎదురు నిలిచేవాడు వస్తాడు. అలలపై ఆవేశంగా నడిచే వారికి, ఎదురు నిలిచే వాడు వస్తాడు. పరదాలు తొలగుతాయి, పావురాలు ఎగురుతాయి. ఎదురు నిలిచే వాడు వస్తాడు. అమాయకులను, అభాగ్యులను, ఆశ్రితులను ఆదుకోని ఎదురు నిలిచే వాడు వస్తాడు. గోడమీది పిల్లులను, గోతికాడ నక్కలను, గద్దెమీద అహంకారులను, తెలుగువారి శతృలను, తెరమరుగు చేసి తేజముతో ఎదురు నిలిచే వాడు వస్తాడు. ముసలి సింహం జూలు పీకి గరుడ గర్వ భంగం చేసి పొగరు గుర్రం …
మిత్రమా, ఈ తుఫాను రాత్రి కూడా, నీ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నావా. ఆకాశం ఓ అభాగ్యునిలా మూలుగుతుంది. ఈ రాతిరి నాకు నిద్దుర లేదు. ఎప్పటికీ ద్వారాలు తెరచి ఉంచి మరళ మరళ చీకట్లోకి చూస్తున్నాను. నా ఎదుట ఏమీ కనిపించలేదు. నీ మార్గం ఎక్కడ ఉన్నదో కదా. ఏ నది ఒడ్డుగుండా, ఏ అడవి అంచుగుండా, ఏ పద్మవ్యూహం గుండా, వస్తున్నావు, మిత్రమా. గీతాంజలి 23 Art thou abroad on this stormy night on …
వర్షాకాలపు నీడల్లో నీడవై చూసే కళ్లను ఏమారుస్తూ అద్దమ రేయి నిశబ్ధంలా రహస్య సోపానాలపై నడుస్తుంటావు. ఈ రోజు ఉదయం కళ్లు మూసుకుంది. చెప్పా పెట్టకుండా తూర్పు గాలి రయ్ మంది. ఇంకా, నిత్య చైతన్యపు నీలాకాశంపై లావుపాటి పరదా ప్రత్యక్ష్యం అయింది. అడవి తన సంగీత సాధన నిలిపింది. ఇళ్ల తలుపులు మూసుకున్నాయి. ఈ నిర్జన నిశబ్ధ రహదారిపై నువ్వు ఏకైక ఏకాంత బాటసారివి. నా ఏకైక మిత్రమా, నా ప్రియ మిత్రమా, నా ఇంటి ద్వారాలు తెరచే ఉన్నాయి. కలలోలా నన్ను దాటి …
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/dec/29main27 హైదరాబాద్, డిసెంబర్ 29 (ఆన్‌లైన్): తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందనడం అవాస్తవమని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్. తులసిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అనేక రంగాలలో తెలంగాణకే సింహ భాగం దక్కినట్టు తెలియజేశారు. వాస్తవాలను మరుగుపరచి టీఆర్‌ఎస్ నేతలు, తెలంగాణ విద్యావంతుల వేదిక గోబెల్స్ ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర జనాభాలో తెలంగాణ …