నే ఆలపించాలని వచ్చిన పాట ఇంకా అలానే ఉంది. నా రోజులన్నీ తీగలు సరిచేస్తూ శృతి చూసుకోవటంలోనే గడిపేశాను. ఆ గడియ ఇంకా రాలేదు. పదాల పొందిక కుదరలేదు. యద విషాదం మాత్రం నిలిచింది. పూల గుత్తి ఇంకా విచ్చుకోలేదు. గాలి మాత్రం నిట్టూరుస్తూ పయనిస్తుంది. వాని మోము చూడలేదు, వాని గొంతు వినలేదు, నా ఇంటి ముందున్న రోడ్డుపై వాని అడుగులు మాత్రం విన్నాను. రోజంతా నేలపై అతని ఆసనం సరిచేయటంతోనే సరిపోయింది. ఇంకా లాంతరు …
నా ప్రయాణానికి పట్టు కాలము బహుళము. ఆ దారి పొడవు కూడా బహుళము. ఉషస్సంధ్య తొలి కాంతి కిరణ వేళకి నా రథ యాత్ర మొదలు పెట్టాను. గిరుల గుండా, తరుల గుండా కొనసాగించాను. ఎన్నో గ్రహాలపై, తారలపై రోజా అచ్చులద్దాను. అది ఎంతో దూర ప్రయాణం – నీ తావు దగ్గరకి తీసుకెళ్లేది. ప్రశాంత నీ ధామ యాత్ర శిక్షణ బహు జిగిబిగి క్లిష్ట సంక్లిష్టము. గడప గడపా తిరిగి, గడియ గడియా కొట్టి, చివరాకరకు సొంత గూడు చేరాల యాత్రీకుడు. …
ఈ జప తప కీర్తనలు ఒగ్గేయి ఒంటరిగా ఎవరికి పూజ చేస్తున్నావు? ఈ గుడి చీకటి మూల గదిలో! నీ కళ్లు తెరచి చూడు, నీ దేవదేవుడు ఎదురుగా లేడు. అతనక్కడ ఉన్నాడు – నేల తొవ్వే పని వాడితో, రోడ్డుకై రాళ్లు కొట్టే వానితో. అతను వారితో ఉన్నాడు – ఎండలోనూ, వానలోనూ. అతని దుస్తులు దుమ్ము కొట్టుక పొయ్యాయి. నీ కాషాయ వస్త్రాలు పక్కన పెట్టి అతనిలా నేలపైకి దిగిరా. మోక్షం! ఈ మోక్షమెక్కడ …
నీ పాద పీఠమిక్కడ, నీ పాదమక్కడ దీనులు, పేదలు, అనాథల చెంత. నీకు పాదాభివందనం చేద్దామంటే దీనులు, పేదలు, అనాథల చెంత దిగువనున్న నీ పాదము చేరలేనే. అహంకారమెన్నటికీ చేరలేదు దీనులు, పేదలు, అనాథలతో నువ్వు వినయ వస్త్రాలతో నడచు చెంతకు. నా హృదయమక్కడికెప్పటికీ దారి కనుక్కోలేదు – దీనులు, పేదలు, అనాథలు మొన్నగు తోడులేని వారికి నువ్వు తోడుండు చోటికి. —- == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ అనువాదం. …
నీ భుజాలపై నిన్ను నువ్వే మొయ్య చూసే, మూర్ఖా! నీ ఇంటిముందు నువ్వే బిక్ష ఎత్తుకునే, మూర్ఖ శిఖామణీ! జగన్నాథునిపై భారమేసి అంతా మర్చిపో, వెనుతిరిగి ‘అయ్యో’ అనుకోవల్సిన పనుండదు. నీ కోరిక నిశ్వాసం, తాకిన ప్రతీ దీపాన్నీ వెంటనే ఆర్పేస్తుంది. అది అపవిత్రమైంది. అశుద్ద చేతుల్తో అది నీకిచ్చే బహుమతులందుకోకు. పవిత్ర ప్రేమ ఇచ్చే బహుమానాలు మాత్రమే తీసుకో. —- == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ అనువాదం. Inspired By …
http://blogs.msdn.com/translation/default.aspx maikrOsaaphT-tarjumaa-pari (Read this in English Script, but Telugu Language)
రాకుమారుని దుస్తుల్లోని బాలుడు, మెడ చుట్టు బంగారు గొలుసుల వాడు, ఆటల్లో ఆనందమంతా కోల్పోతాడు. ఎక్కడ బట్టలు నలుగుతాయో అని, ఎక్కడ బట్టలకి దుమ్ము పడుతుందో అని, అడుగడుగునా తడబడుతుంటాడు. అందరికి దూరంగా ఉంటాడు. కదలటానికి కూడా భయపడతాడు. అమా, అలంకరణలపై నీ వ్యామోహం, పిల్లోన్ని భూమాతకి దూరం చేస్తే, మానవ జీవిత సంతకు దూరం చేస్తే, అది — అసలు లాభం లేని పని. —- == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ …
నా కవితా కన్య, ఆభరణాలన్నీ తీసేసింది. అలంకారంపై, అనల్ప వస్త్రంపై నిర్మోహి ఆమె. ఆభరణాలు మన సమాగమాన్ని చెడగొడతాయి. నీకూ, నాకూ మధ్య అవి అడ్డమొస్తాయి. ఘల్లు ఘల్లుమంటూ నీ గుసగుసలు విననీవు. ఈ కవి ఆత్మగౌరవం సిగ్గుతో మరణిస్తుంది — నీ ముందు. ఓ జగద్గురూ! నీ పాదాల వద్ద కూర్చున్నాను నా జీవితమిలా నేలపై నింపాదిగా సాగనీ, సంగీతంలో మునిగి తేలుతున్న ఆ గడ్డి వేణువులా. —- == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ …
ఈ చిట్టి పువ్వును తెంపి తీసుకో, జాగు చేయక! వాడి రాలిపోతుందని భయపడుతున్నా, ప్రభూ! నీ మాలలో చోటు దొరక్కపోవచ్చు, అయినా పరమ పురుషా! నీ కరస్పర్శతో గౌరవిస్తూ తెంపుకో. నీ పూజాసమయం వచ్చి వెళ్లిన విషయమే నే గమనించకుండా పోతానని భయపడుతున్నా. పుష్పమింకా పక్వానికి రాకున్నా, సువాసనింకా ఘాటెక్కకున్నా, కాలమింకా ఉన్నప్పుడే తెంపుకో, నీ సేవలో భాగం చేసుకో, పరమాత్మా! —– == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ అనువాదం. …
ఒక్క క్షణం, నీ సాంగత్యానుభవ అవకాశమీయవా ప్రభూ, నా రాచకార్యాలన్నీ తర్వాతే చూస్తాను. నీ మూఖారవిందానికి దూరమైతే నా హృదయమయ్యేనవిశ్రాంతం. ఒడ్డు లేని మహా సముద్రం వలె — నా పనులన్నీ అగమ్యగోచరాలయ్యేను. ఈ రోజు ప్రకృతి నా చెంతకొచ్చింది - కువకువలు, కిలకిలలతో. విరబూసిన పూలమొక్కలపై తుమ్మెదలు నాట్యమాడుతున్నాయి. ఈ విశేష నిశ్శబ్దానంత కాలంలో నీ ముందు సూఖాసీనుడనై పూర్ణాంకిత పాట పాడ కాలమాసన్నమైంది. —- == ఇవి కూడా చూడండి == 1. ఏకాంతపు దిలీప్ అనువాదం. …