Category Archives: పరిశోధనా వ్యాసం

మత సమాజాలు, విమ్మత సమాజాలు — పరిణామక్రమంలో ఏవి నిలుస్తాయి?

మత సమాజాలు విమ్మత సమాజాలు పరిణామ క్రమంలో ఎవరు నిలుస్తారు? జవాబు తేటతెల్లంగా మత సమాజాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ అవే కదా నెగ్గినవి, గెల్చినవి, మిగిల్నవి. కాకుంటే గెల్చిన ప్రతి మత సమాజంలోనూ ఎంతో కొంత విమ్మతం మిళితమై ఉంది. బహుశా మతం, విమ్మతం సమపాళ్లలో కల్సి ఉంటేనే ఆ సమాజం మిగుల్తుందేమో. కానీ మతం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. గతంలో కనీ వనీ ఎరుగని సాంకేతిక అభివృద్ది జరుగుతున్న నేటి కాలంలో నమ్మకాన్ని కొనసాగించటం కష్టం.

ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు — పరిణామ క్రమంలో ఏమి జరుగుతుంది ?

ఒక సమాజంలో పూర్తిగా పెద్దను కుదిర్చిన వివాహాలే జరుగుతుంటే, అదే విధంగా మరో సమాజంలో పూర్తిగా ప్రేమ వివాహాలే జరుగుతుంటే పరిణామ క్రమంలో ఆ సమాజాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ విషయం ఒక డాక్టరేట్ కోసం పరిశోధన చెయ్యదగ్గ విషయం అని నాకన్పిస్తుంది. అనగా ఈ విషయం పై నా జ్ఞానం బొత్తిగా శూన్యం అని అర్థం. ఈ దిగువ వ్రాసిన విషయాలు ఎక్కువగా నా అజ్ఞానాన్ని బయటపెట్టేవే అయి ఉండవచ్చు. అయినను -ఎవరి బ్గాగుకు వారే