Category Archives: గీతాంజలి

గీతాంజలి 43 — రాజముద్రలు

  ఆ రోజు ప్రభూ, నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు. నేను పిలవకుండానే ఒక సామాన్యునిలా హృదయంలోకొచ్చి అశాశ్వత క్షణాలపై అమృత ముద్రవేశావు. ఈ రోజు అనుకోకుండా గతం నెమరు వేసుకుంటూ నీ రాజముద్రలు చూశాను. అవి ఆనంద విషాదాల్తో కలగలిసి మర్చిపోయిన మామూలు అనుభవాల్లో దుమ్ములో చెదురుమదురుగా ఉన్నాయి. చిన్నప్పుడు మట్టిలో ఆడేనాటినుండి కావాలనే అలక్ష్యం చేయకున్నా అప్పుడు నే విన్న అడుగుల చప్పుడు తారల నడుమ ఇప్పుడు ప్రతిద్వనిస్తున్నదే. —– The day was when I did not keep myself

ప్రేమ జ్ఞాపిక – గీతాంజలి 52

మధుర ప్రేమకు జ్ఞాపికగా మెడపైనున్న గులాబీ మాలను స్వయంగా అడగాలనుకున్నా. కానీ, ధైర్యం చాల్లేదు. —- మీరెళ్లాక పరుపుపై రాలిన, పూరేకులనే దాచుకోవాలని ఉదయం కోసం వేచాను. —- ఉదయ సంధ్య వేళలో ఆకొన్న బిక్షగత్తెలా పరుపంతా వెతికాను. ఒకటీ అరా అయినా పూరేకులు దొరుకుతాయని. కానీ, ఏమిటిది? ఆహా! ఏమి ప్రేమ కానుక!! పూవులు కాదు, పరిమల ద్రవ్యం కాదు, స్వర్ణాభరణం కాదు. ఇది అమోఘ ఖడ్గం- అగ్గిలా మెరుస్తున్న , పిడుగులా బరువైన, నీ నందకమిది. —— ఉదయపు తొలి కిరణాలు, కిటికీ

ప్రభువు ఆగమనం. గీతాంజలి 51

రాత్రి చిక్కబడింది. మా దిన కర్మలు పూర్తయ్యాయి. రావాల్సిన వారంతా వచ్చారనుకోని, గ్రామంలో తలపులన్నీ మాశాం. ఒకరు మాత్రం అన్నారు- ప్రభువు వస్తారు , అని. మేమంతా పగలబడి నవ్వి అంత సీన్ లేదులే, అన్నాం.   తలుపులు చప్పుడయినట్టనిపించింది. ఏదో గాలికి కదిలాయిలే అనుకోని దీపాలార్పేసి నిద్రలోకి జారుకున్నాం. ఒకరు మాత్రం అన్నారు- అది ప్రభువు దూత, అని. మేమంతా పగలబడి నవ్వి, అది గాలేలే, అన్నాం.   అద్దమ రేయి వచ్చిందా చప్పుడు భూమి కంపించింది, గోడలు గడగడలాడాయి.

గీతాంజలి 50 — ఎవరీ రాజాధిరాజు

    ఊరిలో వీదంట తిరుగుతూ,ఇంటింటా అడుక్కుంటుంటే, దివ్య స్వప్నంలో వలె, దూరంగా, బంగారు రధం పై నీ దర్శనమైంది. ఎవరీ రాజాధిరాజు అనుకుంటూ ఆశ్యర్యపొయ్యాను.   నా ఆశలు పైకెగశాయి, నా దీన రోజులకిహ శలవు అనుకున్నాను. అడక్కుండానే కానుకలిస్తావనీ, బంగారు నాణాలు నా చుట్టూ పరుచుకుంటాయనీ అనుకుంటూ నిలుచున్నాను.   రథం సరిగ్గా నే నిల్చున్న చోటనే ఆగింది. మీ చూపు నాపై పడింది, చిరునవ్వుతో దిగి వచ్చావు. ఇంకేముంది నా పంట పండింది అనుకున్నాను. అప్పుడు

గీతాంజలి 49 – నా పూరింటి చెంత నిలిచావుగా, ప్రభూ!

  స్వర్ణ మణిమయ రత్న ఖచితాసనం దిగి, నా పూరింటి చెంత నిలిచావుగా. ప్రభూ! —- ఓ మూల నే ఒంటరిగా పాడుతుంటే — ఆ సంగీత మాధుర్యం నీ చెవుల చేరగా — నా పూరింటి చెంత నిలిచావుగా. ప్రభూ! —- నీ ఆలయాన సంగీత బ్రహ్మలెందరో, పాటలక్కడ నిరంతరం ప్రవహించు, అయినా — ఈ పిల్లవాని పాటలు నీ ప్రేమపాత్రమైనాయి. ప్రభూ! —- అమోఘ విశ్వ సంగీతంతో కలిసిన నా విషాద గీతానికి మెచ్చి నీవు బహుమతిగా ఓ పుష్పం చేబూని నా పూరింటి

ఉదయాన్నే గుసగుసలు

ఉదయాన్నే గుసగుసలు మనిద్దరం కలిసి పడవపై కేవలం మనిద్దరమే సుమా, అలా అనంత తీరానికి ఆనంద లోకానికి వెళ్తామని ఉదయాన్నే గుసగుసలు. అంతే లేని సముద్రంపై నీ నగుమోము చూస్తూ అలల్లా పూర్ణస్వేచ్చతో బంధనాలు లేని పదాలతో నా పాటలు పరవశిస్తాయి. ఇంకా ఆ ఘడియ రాలేదా ఇంకా పని మిగిలేఉందా యో, సాయంత్రం తీరం చేరిందే. మసక వెలుగులో సముద్ర- పక్షులు గూటికి మరళాయే. ఎవరికి తెలుసు? సంకెళ్లెప్పుడు తెగుతాయో. సాయంత్రపు చివరి కాంతిరేఖలా పడవ ఎప్పుడు చీకట్లోకి సాగుతుందో ఎవరికి తెలుసు ? — Early

ప్రయాణం – గీతాంజలి 48

  ఉదయపు నిశబ్దం కాస్తా పక్షుల పాట కచేరీగా మారింది దారి పొడగూతా పూలు విరిశాయి. స్వర్ణ సంపదంతా మబ్బు కొసల చేరింది. ఇవేమీ పట్టించుకోకుండా బిజీగా మా పరుగులో మేమున్నాం.   మేమానంద తాండవమాడలేదు, పాడలేదు. ఇచ్చిపుచ్చుకోటానికే గ్రామమూ వెళ్లలేదు. మాటాడలేదు, నవ్వలేదు. దారిలో ఎక్కడా ఆగలేదు కాలంతో ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తాము.   సూరీడు నడినెత్తికొచ్చాడు నీడల్లో పావురాలు సడిచేశాయి మద్యాన్నపు వేడిగాలిలో ఎండిన ఆకులు ఊగుతూ నాట్యం చేశాయి. గొల్ల పిల్లోడు సుడిపడి మర్రి చెట్టు

గీతాంజలి 47

  అతని కోసం నిష్పలంగా ఎదురుచూస్తూనే, అటో ఇటో రాత్రంతా గడిపాను.   అలసి సొలసి నే నిద్రించిన ఉదయ వేళ అకస్మాత్తుగా అతనొస్తాడేమో అని నా ఆందోళన.   మితృలారా, అతనికి దారి తెరిచే ఉంచండి. అతన్ని ఆపకండి.   అతని అడుగుల చప్పుడు నన్ను లేపకుంటే నన్ను నిద్రలేపకండి — దయుంచండి.   ఉదయ కిరణాల జాతర వేళ పక్షుల కలకలారవాలతో గాని, గాలి హోరుతో గాని, మేల్కోవాలని నే కోరుకోవడం లేదు.   నా ప్రభువు వాకిలి చెంతకొచ్చినా

సుదూర కాలం (గీతాంజలి 46)

  ఎంత సుదూర కాలం పయనించి నను కలవ వస్తున్నావో తెలీదు. నీ సూర్య చంద్రులు నీ జాడలను నా నుండి దాచలేరు నిక్కముగ.   ఎన్నో ఉదయాలు ఎన్నో సాయంత్రాలు నీ అడుగులు విన్నాను నా హృదయంలోని నీ దూత రహస్యంగా నను పిలిచాడు.   ఈ రోజెందుకిలా అదోలా గాలిలో తెలుతున్నట్టుందో హృదయమానందమాడుతుందో అస్సలు తెలీటంలేదు.   నా పనులన్నీ ముగించు కాలమాసన్నమయినట్టుంది. నీ జాడ చూపు తీయని సువాసన నే చూస్తున్నాను.       —- గీతాంజలి 46 I know

గీతాంజలి 45 – అతని నిశబ్ద అడుగులు వినపడలేదూ…

అతని నిశబ్ద అడుగులు వినబడలేదూ? అతను వస్తాడు, ఎప్పటికీ వస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం మరి ప్రతి తరం ప్రతి పగలు మరి ప్రతి రాత్రి ఎప్పటికీ వస్తూనే ఉంటాడు. ఎన్నో భావావేశ క్షణాల్లో ఎన్నో రీతుల పాటలు కట్టాను కానీ అన్నీ ఒకే పాట పాడాయి అతనెప్పటికీ వస్తూనే ఉంటాడని. ఏప్రియల్ ఎండలు మండే వేళ ఆ సౌగంధికా వన మార్గం గుండా అతనెప్పటికీ వస్తూనే ఉంటాడు. జూలై వానల నీడల వేళ ఉరుముతున్న మేఘ వాహనంపై అతనెప్పటికీ వస్తూనే ఉంటాడు. పెను విషాద వేళల్లో అతని పాదఘట్టలే నా