Category Archives: random

కల – కాన్సెప్ట్ కాలేజీ

కొత్తగా కాన్సెప్ట్ కాలేజీ తెరిచారు. డబ్బులు బాగానే కట్టి చేర్పించారు. చేరంగనే గుండె ఆపరేషన్ చేసి ఎడమ చేతిలో పెట్టారు. ఆ గుండె నుండి పైప్ శరీరంలోకి వెళ్తుంది. నడవటం, రోజువారి పనులు చేసుకోవటం కష్టంగా ఉంది. బతుకు క్షణక్షణం గండంగా ఉంది. కుడి చేతికి పుస్తకం అతికించారు. ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అమ్మ వచ్చింది. చేతిలో గుండె చూసింది. ఇంటికి వెళ్తానంటే గుండె మళ్లా లోపల పెట్టి కుడతారు అని నాకు ఎవరో చెప్పారు. kala-kaansepT-kaalEjee (Read this in

Random lines …

నవ్వటం రాని వాడు, నాజూకు చూపనివాడు, నేటి తెలుగు సినీ హీరో. —– నిరుత్తుడనై నిర్లిప్తుడనై ఆపై నిర్జీవుడనై నేనే —- ఆవేశంలో నీవు హాస్యంలో నేను —– हरी ఇంత జ్ఞానమెందుకిచ్చావురా ఇన్ని ప్రశ్నలెందుకిచ్చావురా నీ మందార మకరంద వనాలలో రంగుల సీతాకోకచిలకను చెయ్యక हरी —- माधवा योगेशा कृष्णा पाहि —- అగ్గి తగలగానే విచలితులవుతున్నారందరూ పొగ మేఘాలు వెళ్లాక కన్నీటి మయమవుతున్నా నేను. —- “నడుస్తున్న గ్రంథాలయం నువ్వుండగా అనవసరంగా పుస్తకాల్లో